Nikhat Zareen: డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్.

Nikhat Zareen: డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్.
X
యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పాసింగ్ ఔట్ పరేడ్

భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే… అయితే.. ఈరోజు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. డీఎస్పీ, ఇంటర్నేషనల్ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ఆమెతో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ యూనిఫాం ధరించడం గౌరవంగా ఉంది.. తన కల నెరవేరిందని అన్నారు. ఇప్పటి వరకు బాక్సర్ నిఖత్ అని పిలిచే వారు.. కానీ ఇప్పుడు డీఎస్పీ నిఖత్ అని కూడా పిలుస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ట్రైనింగ్ పొందుతున్న కానిస్టేబుల్స్‌కి బాక్సింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వాలని డీజీపీ కోరారని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి కూడా ఒలింపియన్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌ను తయారు చేయొచ్చని నిఖత్ జరీన్ తెలిపారు.

డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇద్దరు ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు మన టీజీఎస్పీ (TGSP)లో చేరారని అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని తెలిపారు. వీళ్ళను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా.. బాక్సింగ్, క్రికెట్ పై కూడా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది ఆశయం అని డీజీపీ జితేందర్ చెప్పారు.

Tags

Next Story