TG : చిన్న సాకులతో రుణమాఫీ ఎగ్గొడుతున్నారు .. నిరంజన్ రెడ్డి ఫైర్

TG : చిన్న సాకులతో రుణమాఫీ ఎగ్గొడుతున్నారు .. నిరంజన్ రెడ్డి ఫైర్
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుబంధు అమలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న సాకులతో రైతు రుణ మాఫీని ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో రూ.లక్ష లోపు రుణమాఫీ కాని వారు చాలా మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతలు వస్తే రుణమాఫీ కానీ రైతులను చూస్తామన్నారు. మాటల్లో గొప్పలు చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో అనేక కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం రుణ మాఫీకి ఇంకా రూ.18 వేల కోట్లు కావాలని.. ఈ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి డాలర్ల రూపంలో తెస్తారా అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ భరోసా లేదని అన్నారు.

‘తెలంగాణ రైతాంగానికి ఓ విజ్ఞప్తి. అర్హులై ఉండి ఇప్పటి దాకా లక్ష, లక్షన్నర లోపు రుణాలు మాఫీ కాని వారు ఫిర్యాదులు చేసేందుకు తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం. రుణమాఫీ కాని రైతులు మొబైల్ నెంబర్ 8374852619 కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపించాలి. మాకు వచ్చిన సమాచారం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. రైతుల సంఖ్యపై కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెబుతోంది. 60 లక్షలకుపైగా రైతులు రుణాలు తీసుకుంటే కాంగ్రెస్ సర్కార్ ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతోంది’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.

Tags

Next Story