Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు .. తిరుపతన్నకు నో బెయిల్

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు .. తిరుపతన్నకు నో బెయిల్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు తిరుపతన్నకు హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం.. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేయలేమని తెలిపింది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ తరుణంలో బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags

Next Story