Telangana : చికెన్ తినొచ్చు.. ఇబ్బంది లేదన్న పశుసంవర్థక శాఖ

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని, చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాష్ట్ర పశు సంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మృతిచెందిన కోళ్ల రక్తనమూనాలను ల్యాబ్ కు పంపించామని, ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందన్నారు. పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువన్నారు. అదేవిధంగా.. ప్రజలు చికెన్, గుడ్డు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం కాబట్టి అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిపై భయపడాల్సిన అవసరంలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com