Local Body Elections : అక్కడ నో ఎలక్షన్స్....స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన కీలక తేదీలను ప్రకటించడంతో రాష్ట్రంలో సందడి మొదలైంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రాష్ట్రమంతటా ఎన్నికల కోలాహలం మొదలైనా, కొన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోమని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. కోర్టు కేసుల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని తెలిపారు. కరీంనగర్ , ములుగు జిల్లాలకు సంబంధచిన 14 ఎంపీటీసీ స్థానాలు, 27 గ్రామ పంచాయతీలు, 246 గ్రామ వార్డులు ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. వీటిలో ఒక్క ములుగు జిల్లాలోనే 25 గ్రామ పంచాయతీలు ఉండడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com