Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో నో ఎంట్రీ బోర్డులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజా ప్రతినిధులకు అనుమతిని నిషేధించారు. ఈ మేరకు అసెంబ్లీలో నో ఎంట్రీ బోర్డులు దర్శనమిచ్చాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియోలు తీయొద్దని మీడియాను కూడా ఆదేశించారు. దీనిపై మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో పర్యాటకంపై చర్చ జరుగుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభా మర్యాదలు పాటించాలని, సభాపతిని గౌరవించాలని విపక్ష నేతలను స్పీకర్ కోరారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని సూచించారు. మరోవైపు తమకు మాట్లాడే సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. నిరసనల నడుమ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదని హరీశ్ రావు అన్నారు. ఏ సబ్జెక్ట్ పై మాట్లాడాలో చెప్పలేదని తెలిపారు. సభను కనీసం 15 రోజులు జరపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com