TG : 111 జీవో పరిధిలో నిర్మాణాలకు నో లోన్స్

TG : 111 జీవో పరిధిలో నిర్మాణాలకు నో లోన్స్
X

గ్రేటర్ పరిధిలో చెరువులను ఆక్రమంచి ఎఫ్​ టీఎల్ పరిధిలో, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులకు హైడ్రా(డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)వణుకుపుట్టిస్తోంది. వరుస కూల్చివేతలతో దూసుకెళ్తోంది. చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేయడంలో హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల మాదాపూర్ లోని కావూరి హిల్స్, అమీన్ పూర్, కూకట్ పల్లిలోని నల్లచెరువు ఏరియాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన కనిపిస్తున్నది. సొంతంగా కూడగట్టుకున్న డబ్బుతోపాటు బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లు పోయిందని చాలా మంది వాపోతున్నారు. అయితే, 111 జీవో పరిధిని సైతం హైడ్రా పరిధిలోకి తీసుకు రావాలన్న యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పరిధిలో కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చెరువుల్లో నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయినట్లు సమాచారం. రెండు మూడ్రోజుల్లో బ్యాంకర్లతో ఆయన సమావేశమై ఇలాంటి నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ఆదేశించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ వన్ జీవో పరిధిలో కొత్త నిర్మాణాలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకాడుతున్నట్లు సమాచారం.

Tags

Next Story