MLC Kavitha : నన్ను పార్టీ నుంచే పంపే సీన్ ఎవరికీ లేదు : కవిత

తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికి లేదు... తనను పార్టీ నుంచి బయటకు ఎవరు పంపుతారని, అంత సీన్ ఎవరికి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకువీరుల్లాగా తనపై ప్రతాపం చూపిస్తున్నారని కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీపై మాట్లాడాలి కాని తనపై దాడి చేస్తే ఎలా అని చెప్పారు. తనపై ఇంతగా దుష్ప్రచారం జరుగుతుంటే పార్టీ ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడుతామంటే ఎలా అని నిలదీశారు. దొంగలను పట్టుకోమంటే చేతకాక తనపై ప్రతాపం చూపితే ఎలా..? అని మండిపడ్డారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో సైనికురాలిగా పని చేశానని, తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉండి తప్పు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని ఆమె అన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేసీఆర్ కు రాసిన లేఖలో తాను కేవలం సూచనలు మాత్రమే చేశానని, అందులో ఒక్కటైనా తప్పుగా ఉందా..? అని ప్రశ్నించారు. కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ తాను ఉండనని, కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా..? అని ఫైరయ్యారు. తన తండ్రికి వందల లేఖలు రాశానని, లేఖలు రాయడం తప్పా..?, దొంగలను పట్టమంటే చేతకాక తనపై ప్రతాపం చూపితే ఎలా అని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com