TG : మహిళల్ని కించపరిచే సన్నివేశాలొద్దు.. మహిళా కమిషన్ సీరియస్

సినిమాల్లో మహిళల్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉండకూడదని, అలా కాదని ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. సినిమా దర్శకులు, నిర్మాత లు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. కొన్ని సినిమా పాటల్లో ఇటీవల ఉపయోగిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ కమిషన్ కు పలు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన కమిషన్ ... సినిమా సమాజంపై బాగా ప్రభావం చూపుతుందని, వాటిలో మహిళల్ని అవమానించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెపస్ను వెంటనే నిలిపివే యాలని ఆదేశించింది. సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం నైతిక బాధ్యతన్న కమిషన్... యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్నిదృష్టిలో ఉంచుకొని పరిశ్రమ స్వీయనియం త్రణ పాటించాలని సూచించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్ పర్సర్ నేరెళ్ల శారద ఒక ప్రకటన విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com