TG : ఏడు గంటల తర్వత నో ట్రీట్ మెంట్?

X
By - Manikanta |5 Nov 2024 5:45 PM IST
పేదవాడికి ఏ రోగం, నొప్పి వచ్చినా.. వెంటనే వెళ్లేది ప్రభుత్వ ఆస్పత్రులకే. అయితే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మాత్రం.. బాధతో వచ్చే రోగులను పట్టించుకోకుండా, వైద్యం చేయకుండా సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సోమవారం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఓ ఘటన బలం చేకూరుస్తున్నది. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో తీవ్ర జ్వరంతో ఓ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాడు. తనకు వైద్యం చేయాలని సిబ్బందిని కోరగా.. ఇప్పుడు ట్రీట్ మెంట్ చేయడం కుదరదు.. ఓపీలో రావాలి అని వెనక్కి పంపారు. జ్వరం ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. చివరికి చేసేదేం లేక.. దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com