TG : గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత లేదు : సూపరింటెండెంట్ రాజకుమారి

TG : గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత లేదు : సూపరింటెండెంట్ రాజకుమారి
X

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి స్పష్టం చేశారు. నీటి సమస్యతో సర్జరీలు జరగక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. ఆసుపత్రుల్లో రోగులకు సకాలంలో మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. 20 ఏళ్ల క్రితం అమర్చిన మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో వాటిని స్థానంలో ఆరు కొత్త మోటార్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కొత్త మోటర్లు ఏర్పాటుచేసే క్రమంలో పాతవాటిని కాసేపు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. పాత మోటర్ల పనితీరు సరిగా లేనందున సమస్య తలెత్తిందని, వాటి స్థానంలో కొత్త మోటార్లను అమర్చి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రికి వైద్య కోసం వచ్చే రోగులు అపోహలను నమ్మవద్దని సూచించారు.

Tags

Next Story