టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్ నామినేషన్.. !

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్ తన నామినేషన్‌ను నిడమనూరు ఆర్వో కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చినపు రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.
సిఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్ధిని బంఫర్ మెజార్టీతో గెలిపిస్తాయని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇవాళ్టి మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. చేపట్టనున్నారు అధికారులు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్, మే 2న ఫలితం వెల్లడికానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com