Norovirus : నోరో వైరస్.. సిటీలోకి ప్రవేశించింది.. జర భద్రం

కరోనాతో వణికి పోయిన ప్రజలకు తాజాగా కొత్త రకం వైరస్ పుట్టు కొచ్చింది. కొన్ని రోజులుగా ఉన్నట్లుండి మనిషిలో ఎన్నో మార్పులు.. సాధారణ పరీక్షలకు దొరకడం లేదు. ఏమిటో తెలుసుకునేలోపు మనలో దూరిన వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఈ మధ్య కాలం లో తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అదే నోరో వైరస్.
ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువుగా నమోదవుతున్నాయి. 2020లో భారత్ లో కరోనా సృష్టించిన అలజడి, మోగించిన మరణ మృదంగం మరచిపోకముందే కొత్త వైరస్ రాకతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తవైరస్ ఒకటి వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ హెచ్చరించింది.
నోరో వైరస్ నగరంలోకి ప్రవేశించిందనీ.. రోజుకు 100-120 వరకూ కేసులు నమోదవు తున్నాయని, నగరంలో ఉన్నవారంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. సీజనల్ వ్యాధులు ఈజీగా వ్యాపించే కాలం కావడంతో.. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వర్షాకాలంలో సాధారణంగానే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. వీటికి తోడు ఇప్పుడు నోరో వైరస్ కూడా వ్యాప్తి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. కలుషిత మైన ఆహారం, నీటిద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ బారిన పడినవారిలో 48 గంటల్లోనే వాంతులు, విరేచనాలు, చలి జ్వరం, నీరసం, డీహైడ్రేషన్, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపి స్తాయని తెలిపారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com