TG : అదానీకి అంగుళం భూమి కూడా ఇవ్వలేదు.. పీసీసీ క్లారిటీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక గుంట భూమి కూడా ఇవ్వలేదని, ఆదానీ గ్రూప్ అక్రమాలు చట్టబద్ధంగా రుజువైతే ఆ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంటుందని తేల్చి చెప్పారు. జాయింట్ పార్ల మెంటరీ కమిటీ నివేదిక ప్రకారం అదానీతో చేసుకున్న ఒప్పం దాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుం దన్నారు. చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసినా కాంగ్రెస్ అంగీ కరిస్తుందని, పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. స్కిల్ యూని వర్సిటీకి ఆదానీ కంపెనీ వంద కోట్లు విరాళంగా ఇచ్చిన అంశంపై స్పందిస్తూ... విరాళాలు వేరు రాజకీయాలు, ప్రభుత్వాలు వేరు అని వ్యాఖ్యా నించారు. స్కిల్ యూని వర్సిటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అక్రమ సంపాదనన నుంచి రూ.50 కోట్లు విరాళంగా ఇస్తామంటే స్వీకరిస్తామని చెప్పారు. అదానీ రూ.వంద కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారని, ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ కోసమే వినియోగించిందని స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు రుజువై అదానీ అరెస్టయితే ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని హెచ్చరించారు. ఆదానీ కంపెనీల అక్రమాలపై ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని అడుగుతున్నారని గుర్తు చేశారు. ఆదానీ అరెస్టయితే అనేక అంశాలు బయటకు వస్తాయని తెలిపారు. ప్రధాని మోదీ అండతోనే విచ్చలవిడిగా అదానీ ఆర్థిక దురాగతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com