TG : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెలేకు నోటీసులు

TG : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెలేకు నోటీసులు
X

రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్స్ జరిపినట్లు తేలడంతో పోలీసులు విచా రణకు రావాలని ఆదేశించారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని తెలిపారు. చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనాని కి దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు జారీకావడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. కరడు గట్టిన నేరస్తులు, ఉగ్రవాదులను అరికట్టేందుకు వినియోగించాల్సిన దీనిని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలున్నా యి. అప్పుడు ఇంటెలిజెన్స్ విభాగ అధిప తిగా పనిచేసిన ప్రభాకర రావు ఆధ్వర్యం లో సాగిన ఈ తతంగంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏ1 గా ప్రభాకర్ రావు, ఏ2గా ప్రణీత్ రావు, ఏ3గా రాధాకిషన్ రావు, ఏ4గా భు జంగరావు, ఏ5గా తిరుపతన్న ఉన్నారు. ఈ కేసులో రిటైర్డ్ అదనపు డీసీపీ రాధాకి షన్ రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల రావులు అరెస్ట్ అయ్యారు. గట్టుమల్లు భూపతి అనే సీఐ కూడా అరెస్ట్ అయ్యారు. 2016లో ప్రభాక ర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీ అయ్యారు. ఈ నిందితులంతా కలిసి పని చేయడం కోసం ఆయనే, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ను ఏర్పాటు చేసి ప్రణీత్ రావు కు బాధ్యతలు అప్పగిం చారని పోలీసులు తెలిపారు.

Tags

Next Story