TG : సీనియర్ ఐపీఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు?

X
By - Manikanta |20 March 2025 12:45 PM IST
తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ఇన్చార్జ్ ఉప కులపతిగా ఉన్న సమయంలో ఆమె వర్సిటీ నుంచి వాహన అద్దెకు రూ.61 లక్షల నిధులు తీసుకోవడంపై వర్సిటీ ఆడిట్ టీం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 2016-24 సంవత్సరాల మధ్య 90 నెలలపాటు ప్రయివేట్ వాహనాన్ని స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్నారని సమాచారం. వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు ఆమెకు పలుమార్లు లేఖలు రాసినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేసి ఆమె నుంచి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com