Yadadri District : యాదాద్రి జిల్లాలో క్షుద్రపూజల కలకలం

Yadadri District : యాదాద్రి జిల్లాలో క్షుద్రపూజల కలకలం
X

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ కళాశాలలో క్షుద్రపూజల ఘటన చోటు చేసుకుంది. కాలేజీ ప్రధాన గేటు వద్ద నిమ్మకాయలు, కోడి తలలు, పసుపు, కుంకుమ, మిరపకాయలతో పూజలు చేశారు. దీంతో కళాశాలలోని విద్యార్థులు, టీచర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాళాశాలకు ప్రహారీ గోడ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. క్షుద్రపూజలకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్షుద్ర పూజలు స్థానికంగా కలకలం రేపాయి.

Tags

Next Story