Ganesh Idols : లక్ష విగ్రహాలు.. హైదరాబాద్‌లో అడుగడుగునా పోలీసు పహారా

Ganesh Idols : లక్ష విగ్రహాలు.. హైదరాబాద్‌లో అడుగడుగునా పోలీసు పహారా
X

రాష్ట్ర రాజధానిలో భారీ వాహనాల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 30వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సిటీ నలుమూలల నుంచి విగ్రహాల తరలింపు జరుగుతోంది.

ఈ నిమజ్జనంలో కీలకమైన విగ్రహాలు ఖైరతాబాద్ మహా గణేశుడు, బాలాపూర్ 15 అడుగులు గణనాథుడు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ర్యాలీకి వేలాదిగా జనం తరలివచ్చారు. బాలాపూర్ వినాయక విగ్రహాన్ని కూడా త్వరగా తరలించనున్నారు. ఈ సంవత్సరం దాదాపు లక్ష విగ్రహాల్ని నిమజ్జనం చేస్తున్నారు.

17న సౌత్ జోన్ పరిధిలోని విగ్రహాలను ముందుగా నిమజ్జనానికి తరలిస్తారు. ట్యాంక్ బండ్ వైపు కూడా క్రేన్లు పెట్టారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీఆర్ మార్గ్ లో భారీ క్రేన్లను సిద్ధం చేశారు. మొత్తం 6 జోన్లలో 5 పెద్ద చెరువులతో పాటు తాత్కాలికంగా 73 కృత్రిమ చెరువుల్ని రెడీ చేశారు. ఖైరతాబాద్ జోన్ లో 13, ఎల్బీనగర్ పరిధిలో 12, కూకట్ పల్లి జోన్ లో 11, చార్మినార్ జోన్ లో 10, శేరిలింగంపల్లి జోన్ లో 13, సికింద్రాబాద్ జోన్లో 12 తాత్కాలిక నిమజ్జన పాండ్లను ఏర్పాటుచేశారు.

Tags

Next Story