Minister Ponguleti : లేనోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము

Minister Ponguleti : లేనోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము
X

ఇందిరమ్మ ఇండ్లు లేనోళ్లకే ఇస్తామని... ఉన్నోళ్లు ఆశించినా వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపా లిటీ పరిధిలోని మద్దులపల్లి, తెల్దారుపల్లి, పోలే పల్లి ప్రాంతాల్లో బీటీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు.. ప్రజలు ఏరికోరి తె చ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏడాదిన్నర పూర్తి కావొస్తుందని తెలిపారు. ఈ ఏడాదిన్నర కాలంలో మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్నబియ్యం ఇలా అనేక సంక్షేమ పధకాలను అమలు చేశామన్నారు. ఇంకా అమలు చేయాల్సిన హామీలు కొన్ని ఉన్నాయని వాటన్నింటిని కూడా ఒక్కరోజు ఆలస్యమైనా అమలు చేస్తామన్నారు. 'గత ప్ర భుత్వం చేసిన తప్పిదాల వల్లే సంక్షేమ పథకాలు ప్రజల దరిచేర్చడంలో కాస్త ఆలస్యమవుతుంది. తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పేదవాళ్లలో బహుపేదవాళ్లకు ఇవ్వడం జరిగింది. రెండు, మూడు, నాలుగు విడతలు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తం. ఇప్పుడు ఇళ్లు రాలేదని బాధపడొద్ద నిరాబోయే విడతల్లో వారికి ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నాదే. రాబోవు రోజుల్లో వచ్చే ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే వారికి ప్రజల ఆశీస్సులు అందించాలి' అని పొంగులేటి అన్నారు.

Tags

Next Story