TG : అక్రమ కేసులతో ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నరు : హరీశ్ రావు

లగచర్ల దాడిఘటనలో అరెస్టె చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎఎ స్ ఎమ్మెల్యే హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. పార్టీ ఆయనకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు బయట హరీశ్ రావు మాట్లాడుతూ.. లగచర్లలో తమ భూములను ఫార్మా కంపెనీకి ఇవ్వమని స్థానికులు కొంతకా లంగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సీఎం రేవంత్ బాధితులతో మాట్లడకుండా పోలీసులు, గుండాలతో బెది రింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఓట్లేసినందుకు సీఎం వారిని కట్టుబట్టలతో ఊరి నుంచి తరిమే శారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా పట్నం నరేందర్ రెడ్డి లగచర్లలో స్థానికులకు అండగా నిలిచేందుకు ప్రయత్నించా రని తెలిపారు. దాడి కేసులో ఆయనకు 80 సార్లు ఫోన్ లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు అంటున్నా రని విమర్శించారు. కానీ ఆయనకు రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి ఒక్కసారి మాత్రమే ఫోన్ వచ్చిందని తెలిపారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా బీఆర్ఎస్ నేతల పనే అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని హరీశ్ మండిపడ్డా రు. ప్రజల ఇబ్బందులపై పోరాడటం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ బాధ్యత అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com