Health Minister Damodara : త్వరలోనే ఉస్మానియాకు శంకుస్థాపన : మంత్రి దామోదర

ఉస్మానియా దవాఖానకు తర్వలో శంకుస్థాపన చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని షెర్టన్ హోటల్లో వీక్" మ్యాగ్జీన్ నిర్వహించిన "బెస్ట్ హాస్పిటల్స్ అవార్డ్స్ 2024" కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధా న్యం ఇస్తుందని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు ఫీజుల వసూళ్లలో సానుభూతితో వ్యవహరిం చాలని అన్నారు. ఏడాదిలోనే 8 మెడికల్, 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని 3 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచి కార్పొరేట్ హాస్పిటల్లోనూ పేదలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్న ట్టు చెప్పారు. ఈ సారి ఆరోగ్యశ్రీ కోసం 487 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించామని వివ రించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com