KTR Declares : మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే : కేటీఆర్

KTR Declares : మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే : కేటీఆర్
X

సీఎం రేసులో తాను, కవిత ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఎప్పటికీ కేసీఆరే తమ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వాలా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రూ.2లక్షల రుణమాఫీ సరిగా అమలు చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లెలోనూ రుణమాఫీ అందరికీ అందలేదన్నారు. రైతులు ప్రమాణపత్రాలు రాయడం ఏంటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.లక్ష 7వేల కోట్లు జమ చేసిందన్నారు. రైతుబంధులో రూ.22వేల కోట్లు దారి మళ్లాయని, రైతులను దొంగలుగా చిత్రీకరించేలా అసెంబ్లీలో సీఎం మాట్లాడారని మండిపడ్డారు.

Tags

Next Story