TG : సంక్షేమ గురుకులాల్లో 6వేలకు పైగా ఉద్యోగాలు!

తెలంగాణలోని లోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,800కుపైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతోపాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని దంతవైద్య కాలేజీల్లో ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో భాగంగా తొలి విడత కింద అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ రోజుతో (ఆగస్టు 15వ తేదీ) ముగుస్తుంది. ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని విద్యార్ధులు ఈ రోజు గడువు సమయం ముగిసేలోపు నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com