TG : పాన్ షాపులు ఇకనుంచి ఈవీ చార్జింగ్ పాయింట్లు

TG : పాన్ షాపులు ఇకనుంచి ఈవీ చార్జింగ్ పాయింట్లు
X

కిరాణా, పంక్చర్ దుకాణాలు, పాన్ షాపుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కేవలం రూ. 11వేల పెట్టుబడితో వీటి ఏర్పాటుకు చర్యలు ముమ్మరమవుతున్నాయి. వినూత్న వ్యాపార నమూనాగా వన్ఎం ఇన్వెస్ట్ మెంట్ తో వీటిని ఇన్స్టాల్ చేసేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ పెట్టుబడితో నెలకు రూ. 5వేలు ఆర్జించేలా ప్రభుత్వం ఔత్సాహికులకు ఊతం అందించనుంది. రాష్ట్రప్రభుత్వ పాలసీలు, ఉదారత నిర్ణయాలతో రాష్ట్రంలో ఈవీ వాహన యుగం నడుస్తోంది. వాహనాల విక్రయాల్లోనే కాదు.. త్వరలో కాదు..త్వరలో సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను అమలు చేయనుంది. ఈ మేరకు సర్కార్ త్వరలో కీలక ఉత్తర్వులను జారీ చేసేందుకు రెడీ అవుతోంది. ఎక్కడికక్కడ ఈవీ రీచార్జ్ స్టేషన్లకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో విద్యుత్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ వాహనదారుల్ని ఆకర్షిస్తోంది. దీంతో.. ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలు, బైకుల సంఖ్య పెరుగుతోంది.

Tags

Next Story