Gaddam Prasad : పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. నోటీసులు అందుకున్నవారిలో బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. 2023 ఏడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com