TRS : తాండూర్ ఎపిసోడ్‌పై టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్.. నాలుక మడతేసిన ఎమ్మెల్సీ..!

TRS : తాండూర్ ఎపిసోడ్‌పై టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. దీంతో నాలుక మడతేశారు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి. ఉదయం అది తన గొంతే కాదన్న ఆయన ఇప్పుడు పొరపాటున నోరు జారానంటూ మాట మార్చారు. పోలీసులకు క్షమాపణ చెబుతానన్నారు. పోలీసుల మనసు నొప్పించడం బాధాకరమన్నారు. వారంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. అంతకుముందు.. సీఐపై అనుచిత వ్యాఖ్యల ఆడియో క్లిప్ వైరల్ అవడంతో.. మీడియా ముందుకొచ్చిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి.. అసలు ఆ ఆడియో తనది కానే కాదన్నారు. లోకల్‌గా పడని కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. తాజా పరిణామాల్ని ఆయనకు వివరించారు. అటు పట్నం మహేందర్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రోహిత్ రెడ్డి. ఫ్రస్టేషన్‌తో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలోనూ మహేందర్‌రెడ్డి చాలా గొడవలు సృష్టించారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా TRS తాండూర్ టికెట్ తనదేనని స్పష్టం చేశారు రోహిత్ రెడ్డి. పట్నం బూతు పురాణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు సీఐ రాజేందర్‌రెడ్డి. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బూతులు తిట్టడం బాధ కలిగించిందన్నారు. పట్నంపై కేసు నమోదైందని తెలిపారు. ఇసుక అక్రమ దందాపై వివరాలుంటే పట్నం మహేందర్‌రెడ్డి బయటపెట్టొచ్చన్నారు. అలాగే తాండూర్‌లో రౌడీషీటర్లు ఎవరో కూడా ఆయనే చెబితే బాగుంటుందన్నారు సీఐ రాజేందర్‌రెడ్డి.
అటు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 353, 504, 506 IPC కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సీఐ పట్ల ఎమ్మెల్సీ పట్నం మహేంధర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు యాలాల పోలీస్ స్టేషన్‌లోనూ పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది.. ఎస్సై అరవింద్ ఫిర్యాదుతో 355, 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద యాలాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దిగొచ్చిన పట్నం మహేందర్‌రెడ్డి.. పొరపాటున నోరు జారానని.. పోలీసుల మనసులు నొచ్చుకున్నందుకు విచారిస్తున్నానంటూ ప్రకటన విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com