Pawan Kalyan : హైడ్రా విషయంలో రేవంత్ కరెక్ట్: పవన్ కళ్యాణ్

Pawan Kalyan : హైడ్రా విషయంలో రేవంత్ కరెక్ట్: పవన్ కళ్యాణ్

హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చడం సమంజసమేనని dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా ఏర్పాటు చేసి తెలంగాణ CM రేవంత్ రెడ్డి మంచి పని చేశారని ప్రశంసించారు. విజయవాడలో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్‌లోని చెరువుల్లో ఇళ్లు కడుతుంటే బాధేసేది. ఇప్పుడు రేవంత్ వాటిని తొలగించడం సంతోషంగా ఉంది. అసలు అక్రమ నిర్మాణాలను ముందే అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో సంభవించిన వరదల్లో 29 మంది మరణించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో లోపం ఉందన్నారు. 253 ప్రాంతాలు నీట మునిగితే 100కు పైగా యథాస్థితికి వచ్చాయన్నారు. 45 వేల మంది ప్రజలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.

Tags

Next Story