Akbaruddin : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి: అక్బరుద్దీన్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. బకాయిలతో విద్యార్థులు, విద్యాసంస్థల యాజమన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు చెల్లించి విద్యార్థులకు భరోసా ఇవ్వాలని కోరారు. లేకపోతే నిరసనకు దిగుతామని హెచ్చరించారు. . ప్రజలకు సుపరిపాలనను అందిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు.. విద్యార్థుల ఫీజులు ఎగ్గొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని హెచ్చరించారు. దీనిపై తాము ఉద్యమాలకు రెడీ అవుతున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com