TG : ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన చేస్తున్నం : మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఇంటింటికి సమగ్ర కుల గణన సర్వేను పార్టీ కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇవాళ పీసీసీ చీఫ్ లేఖను విడుదల చేశారు. కులగణన సర్వేలో ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొని అధికారులకు సహకరించాలని ఆయన ఆదేశించారు. దీనిపై గాంధీభవన్లో కనెక్ట్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రోజువారీ గా పార్టీ కార్యకర్తలతో ఈ సెంటర్నుంచి ఫోన్ లో మాట్లాడుతామన్నారు. సర్వే నిర్వహణలో కా ర్యకర్తలకు ఏమైనా డౌట్స్ఉంటే కనెక్ట్ సెంటర్ మాట్లాడవచ్చన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి కుల గణన చేసి, జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పి స్తామని హమీ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ గాంధీయన్ నాలెడ్జ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వానికి కుల గణన, సామాజిక న్యాయం పై దిశా నిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఈ విషయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు చేసే ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టుతున్న కులగణన దేశానికే రోల్మెడల్గా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com