TG : తీన్మార్ మల్లన్నకు పీసీసీ డెడ్ లైన్

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వారం రోజుల డెడ్ లైన్ పెట్టింది పీసీసీ క్రమ శిక్షణ కమిటీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షోకాజ్ నోటీస్ జారీ చేసింది.ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బీసీల మనోభావాలను దెబ్బతీసేలా కులగణన నివేదికను తగులబెట్టినట్లు ఫిర్యాదులు అందాయని లేఖలో తెలిపింది. పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి, వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారని ఆరోపించింది. పీసీసీ నోటీస్ కు తీన్మార్ మల్లన్న రిప్లయ్ ఇస్తారా.. ఇస్తే ఏమని ఇస్తారు.. ఆయనపై పీసీసీ క్రమ శిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. బీసీ సంఘాలతో చర్చించి పీసీసీకి రిప్లై ఇస్తానని తీన్మార్ మల్లన్న ఓ ప్రకటనలో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com