Telangana: 28న పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Telangana: 28న పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
X

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన తర్వాత మీనాక్షీ నటరాజన్ తొలి సారి ఈ నెల 28 న హైదరాబాద్ రానున్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఆమె రావడంతోనే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీనేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టీం సభ్యురాలు. అందుకే ఆమెను ప్రత్యేకించి ఏరికోరి రాష్ట్ర ఇంచార్జీగా నియమించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో ఈ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్య మంత్రి ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్య దర్శులు విష్ణు నాథ్, విశ్వనాథన్ ముఖ్య ఆతిధులుగా పాల్గొంటారు.

Tags

Next Story