TG : ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జీపీఎఫ్, ఇతర బిల్లులు కలిపి దాదాపు రూ.40వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో 10, 15 తేదీల వరకూ ఉద్యోగులకు జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు తాము ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పేదల్లో అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దుచేశామని, దీనికింద ఇప్పటికే గుర్తించిన 496 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలకు బదులుగా రూ.5 లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. లబ్ధిదారుల సంఖ్య 496గా చెప్పడం సరికాదని, ఈ సంఖ్య ఎక్కువగా ఉందని మధుసూదన్ తెలిపారు.
‘‘జిల్లాల అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం 496 మంది మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 19.32 లక్షల గృహాలు నిర్మించింది. గత పదేళ్లలో సర్కారు కేవలం 1.36 లక్షల డబుల్‌బెడ్‌రూం గృహాలు కట్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ప్రకారం అత్యంత పేదలకు గృహాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంతవరకు లబ్ధిదారుల జాబితాలు ఖరారు చేయలేదు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన అధికారుల బృందం అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. పరిశీలించి విధివిధానాలు సిద్ధం చేస్తాం’’ అని మంత్రి వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com