Minister Uttam Kumar Reddy : ఐదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి : మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar Reddy :  ఐదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి : మంత్రి ఉత్తమ్
X

ఐదేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు సాధించ డంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. నార్కెట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రా జెక్టును మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్న ప్రభాకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా మొదటి విడతగా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా రు. ఎస్ఎల్బీసీ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టులను నిర్ల క్ష్యంచేశారని ఫైర్అయ్యారు. రాజకీయ దురు ద్దేశంతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను అశ్రద్ధచే శారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు బ్రాహ్మణవెల్లంల ప్రారంభం ఉంటుందని చెప్పారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 'ఉదయ సముద్రం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.400 కోట్లు ఇస్తే ఎప్పుడో పూర్తి అయ్యేది. నాకు మంచి పేరు రా కూడదని పదేండ్ల పాటు కేసీఆర్ నిధులు ఇవ్వ కుండా నిర్లక్ష్యం చేశారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తం. ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది. గత్యంతరం లేకనే మూసీ నీటి కోసం పోరాటం చేశాం' అని తెలిపారు.

Tags

Next Story