MLA Madhavaram : హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నరు : ఎమ్మెల్యే మాధవరం

హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయపెడుతున్నదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్‌పల్లిలోని చెరువుల విస్తీర్ణం, ఆక్రమణలపై ఎమ్మెల్యే మాధవరం ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఐ ఇచ్చిన నివేదికపై మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని చెరువులపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన నివేదిక అంతా తప్పుల తడక అన్నారు.భట్టి చెప్పిన దానికి ఆర్టీఐ ఇచ్చిన దానికి పొంతనలేదు. ఇప్పటికైనా అధికారులు సరైన సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతుకులకు గురి చేయొద్దన్నారు. చెరువులపై సర్వేకు కమిటీ వేసి స్వయంగా పరిశీలించి నిర్దారించాలన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి చేయాల్సిన పనిని ఆర్థిక శాఖ మంత్రి భట్టి చేస్తున్నారని హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com