Pidamarthi Ravi : మాదిగ జాతిని తాకట్టుపెట్టి పద్మశ్రీ తెచ్చుకున్న మందకృష్ణ... పిడమర్తి రవి ఆరోపణ

మాదిగ జాతిని తాకట్టు పెట్టి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మ శ్రీ అవార్డు తెచ్చుకున్నారని ఎస్సీ కార్పో రేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. పదవులు తన కాలిగోటితో సమానమని చెప్పుకునే మందకృష్ణ పద్మశ్రీ అవార్డును ఎందుకు తీసుకున్నా రని ప్రశ్నించారు. మంగళవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జరిగిన ఒక కార్య క్రమంలో మాదిగ విద్యార్థి యువగర్జన పోస్టర్లను పిడమర్తి రవి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇతర పదవులు తనకు ముఖ్య కాదని, వర్గీకరణే తనకు ముఖ్యమని చెప్పు కునే మందకృష్ణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఇచ్చిన పద్మశ్రీని వెంటనే వెనక్కు ఇచ్చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీకి సంబం ధమే లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ ఎందుకు అమలు చేయడం లేదని ఆ పార్టీ నేతలను ప్రశ్నించకుండా వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు చేయడం తగదనిపిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com