Minister Konda Surekh : మార్కెట్‌లో ప్లాస్టిక్ నిషేధించాలి..

డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో పాటు కూరగాయల మార్కెట్ సమీపంలో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అందరికి లాభం జరిగే విధంగా అర్హులకు షాపులను ప్లాట్స్ కేటాయిస్తామన్నారు. అద్దెల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నారు. డ్రా పద్ధతిలో దుకాణాలను.. కూరగాయల విక్రయాలు ప్లాట్ లను కేటాయిస్తారని అన్నారు. కూరగాయల మార్కెట్‌లోనే పూల దుకాణాలకు చోటు కల్పిస్తామన్నారు. త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు. మార్కెట్ లోని దుకాణాల పై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సెక్రటరీ, కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. నూతనంగా కేటాయించే దుకాణాలకు కమిటీ ఇవ్వాలన్నారు. మార్కెట్‌లో ప్లాస్టిక్ ను నిషేధించాలి.. బాటిల్ వెండర్ ఏర్పాటు చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com