Telangana: ఏపీ నుంచి తెలంగాణకి ధాన్యం లోడుతో వచ్చే లారీలకు చెక్‌పోస్టు దగ్గర బ్రేక్‌..

Telangana: ఏపీ నుంచి తెలంగాణకి ధాన్యం లోడుతో వచ్చే లారీలకు చెక్‌పోస్టు దగ్గర బ్రేక్‌..
Telangana: ఏపీ సహా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

Telangana: ఏపీ సహా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. బోర్డర్‌లో ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి మరీ తనిఖీలు చేస్తున్నారు.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు.. ఈనేపథ్యంలోనే నల్గొండ-గుంటూరు సరిహద్దు ప్రాంతం వాడపల్లి దగ్గర పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.. ధాన్యంతో వచ్చే లారీలన్నిటినీ తిప్పి పంపించేస్తున్నారు..

ఆంధ్రలో వ్యాపారులు తక్కువ ధరకు కొని ఇక్కడ రైతుల ముసుగులో ఎక్కువ ధరలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకే తనిఖీలు చేస్తున్నామని తెలంగాణ అధికారులు చెప్తున్నారు.. ఇప్పటి వరకు ఏపీ నుంచి ధాన్యం లోడుతో 16 లారీలు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా వారిని వెనక్కు పంపించారు. అటు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం దగ్గర కూడా చెక్‌ పోస్టు పెట్టి తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story