TG : ముత్యాలమ్మ టెంపుల్‌కు రాజాసింగ్‌ను తీసుకొచ్చిన పోలీసులు

TG : ముత్యాలమ్మ టెంపుల్‌కు రాజాసింగ్‌ను తీసుకొచ్చిన పోలీసులు
X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టకేలకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లారు. నిందితుడు సలీం ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని పరిశీలించారు. పోలీస్ బందోబస్తు మధ్య ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్.. పరిసరాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి గుడిలో ఏం జరిగిందని తెలుసుకున్నారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన రోజు నుంచి ఆలయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రాజాసింగ్. అయితే పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. శాంతియుత ర్యాలీలో పాల్గొనటానికి కూడా అనుమతి ఇవ్వలేదు.

పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు రాజాసింగ్. ముత్యాల్మమ గుడికి వెళ్లకుండా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో పోలీసులే రాజాసింగ్ ను ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడిన రాజాసింగ్.. తెలంగాణ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితులను వదిలేసి నిరసన తెలుపుతున్న హిందూ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story