Hyderabad : అత్తాపూర్ లో కార్డన్ సర్చ్.. కిరాణా షాప్స్, పాన్ డబ్బాల్లో సోదాలు

X
By - Manikanta |30 Oct 2024 4:15 PM IST
హైదరాబాద్ నగరం అత్తాపూర్ లో పోలీసుల కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. స్థానిక MM పహాడీ తో పాటు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. గంజాయి, విదేశీ మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. అక్కడి పాన్ షాప్ లు, కిరాణా దుకాణాల్లో సోధాలు చేశారు. పలు వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన వారి ఆధార్ కార్డులను తనిఖీ చేశారు. వాహనాలకు ఎలాంటి పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్, గంజాయి, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీపుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీల్లో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా ఉందన్న సమాచారంతో పోలీసులు సడెన్ దాడులు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com