Hyderabad : చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad : చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
X

హైదరాబాద్‌లోని చందానగర్‌ ఖజానా జ్యువెలరీలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ వెనుక బీహార్‌కు చెందిన ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు దోపిడీకి ముందు దాదాపు 20 రోజులు జ్యువెలరీ షాపు వద్ద రెక్కీ నిర్వహించారు. సిబ్బంది తక్కువగా ఉండే, నగర శివారులోని షాపును ఎంచుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. దోపిడీ రోజు ఏడుగురు వ్యక్తులు బైకులపై వచ్చి, చోరీ అనంతరం నకిలీ నంబర్ ప్లేట్లు మార్చుకుని పారిపోయారు. వారు సుమారు 10 కిలోల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. ఈ ముఠా గతంలో కోల్‌కతా, బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

చిన్న ఉద్యోగాల ముసుగులో..

నిందితులు గత రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌లో వారు చేసిన తొలి చోరీ ఇదే. ఈ సందర్భంగా డీసీపీ వినీత్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలను నియమించుకునేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి నేర చరిత్రను పరిశీలించాలని, లేబర్ సప్లై ఏజెన్సీలు తమ వద్దకు వచ్చే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని ఆయన కోరారు.

Tags

Next Story