TG : గన్పార్క్ వద్ద సాయిబాబా సంతాప సభకు నిరాకరణ

TG : గన్పార్క్ వద్ద సాయిబాబా సంతాప సభకు నిరాకరణ
X

విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహా నికి పలువురు నివాళులర్పించారు. గస్పార్కు వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు పలువురు వామపక్ష నేతలు అంజలి ఘటించారు. కామ్రేడ్ సాయిబాబా అమర హే, లాల్ సలాం, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. గన్పార్కు వద్ద 5 నిమిషాల సంతాప సమావేశం ఏర్పాటు చేస్తా మని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా.. పోలీసులు నిరాకరించారు. సాయిబాబా పార్థివదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి నిర్వ హిస్తామని చెప్పినా పర్మిషన్ఇవ్వలేదు. దీంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతం సాయిబాబా పార్థివ దేహాన్ని మౌలాలిలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ పుస్తకాలు కాకుండా సమాజాన్ని చదివేవారు మేధావులని అన్నారు. సాయిబాబా అలాంటి వ్యక్తి అని కొ నియాడారు. ఆయన్ను పదేండ్లు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ చెప్పారు. ఎవరు సమాధానం చెబుతారు? హరీశ్రావు ప్రొఫెసర్ సాయిబాబా జీవితం మొత్తం ప్రజా సేవకే అర్పించారని మాజీ మంత్రి హరీశ్రవు అన్నారు. మౌలాలిలోని సాయిబాబా నివాసా నికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ వైకల్యం కారణంగా జీవితం మొత్తం కుటుంబం సహకారంతోనే గడిపినప్పటికీ ప్రజా ఉద్యమాన్ని ఆపలేద న్నారు. జైల్లో ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిర్దోషి గా బయటకు వచ్చిన సాయిబాబా అనారోగ్యం తోమృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.

Tags

Next Story