TG : మునావర్ జమాపై పోలీసుల ఫోకస్.. మెట్రోపొలిస్ హోటల్ సీజ్

TG : మునావర్ జమాపై పోలీసుల ఫోకస్.. మెట్రోపొలిస్ హోటల్ సీజ్
X

సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు సలీం సహా 151 మంది బస చేసిన మెట్రో పోలీస్ హోటల్ ను పోలీసులు ఖాళీ చేయించారు. హోటల్ లో ఉన్న కస్టమర్లను బయటకు పంపించారు. మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఆలయంలో సలీం దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఆలయంలో దాడి చేసిన సలీం హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా.. మిగితా అనుమానితులను పోలీసులు మంగళవారమే పంపించి వేశారు. నిందితుడు సలీం ఈ హోటల్ లో సమావేశానికి హజరైనట్లు పోలీసులు ధ్రువీకరించారు. పెద్ద ఎత్తున సమావేశం జరిగినా కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ ను పోలీసులు సీజ్ చేశారు.

Tags

Next Story