TG : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసుల నోటీసులు

TG : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసుల నోటీసులు
X

అక్రమంగా లిక్కర్ పార్టీ ఇచ్చారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు జారీ చేశారు. BNSS 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. తమ ముందు హాజరు కావాలని సూచించారు. అడ్రస్ ప్రూఫ్లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు. మోకిలా పిఎస్ కు హాజరుకాకుంటే BNSS 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మోకిల పోలీసులు పెట్టిన కేసులో A1 రాజ్ పాకాలా, A2గా విజయ్ మద్దూరిగా కేసు నమోదు చేశారు. ఓరియన్ విల్లాస్తో పాటు రాజ్ పాకాల శైలేందర్ పాకాల, నాగేశ్వర్ రెడ్డి ఇళ్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓరియన్ విల్లాస్లో విల్లా నంబర్ 5, 40,43లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 53 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విదేశీ మద్యం ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.

Tags

Next Story