TG : గీత కార్మికులకు రక్షణ కవచాలు పంపిణీ చేసిన పొన్నం

TG : గీత కార్మికులకు రక్షణ కవచాలు పంపిణీ చేసిన పొన్నం
X

గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.. కరీంనగర్ పట్టణంలోని రామగుండం బైపాస్ రోడ్డులో గల రేణుకా ఎల్లమ్మ ఆలయం ఫంక్షన్ హల్ ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. సేఫ్టీ మోకు పనితీరుపై గీత కార్మికులకు చెట్టు ఎక్కి అవగాహన కల్పించారు ట్రైనర్.. గీత కార్మికులకు రక్షణగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వారితో సాంకేతికంగా NIT అప్రూవల్ జరిగిన కాటమయ్య సేఫ్టీ కిట్ తయారు చేయడం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. 1500 కిలోల బరువులను కూడా తట్టుకునే విధంగా ఈ సేఫ్టీ కిట్ తయారుచేయడం జరిగిందన్నారు. తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికులు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.. రిజిస్టర్ అయిన 2 లక్షల మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Tags

Next Story