TG : వాట్సాప్, సోషల్ మీడియాతో కేటీఆర్ విషం చిమ్ముతున్నారు.. పొన్నం ఫైర్

TG : వాట్సాప్, సోషల్ మీడియాతో కేటీఆర్ విషం చిమ్ముతున్నారు.. పొన్నం ఫైర్
X

30 యూనివర్సిటీలు కట్టే బదులు 30 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తే బాగుండన్న కేటీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని, మూసీని పర్యటక కేంద్రంగా చేస్తామని మంత్రి తెలిపారు. తప్పుడుగా ఇండ్లకు అనుమతులిస్తే భవిష్యత్తులో అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నామని, మూసీ పరివాహక పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. బలవంతంగా ప్రభుత్వం ఎక్కడా ఇళ్లను కూల్చడం లేదని, ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు.

Tags

Next Story