TG Group 2 : గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం!

TG Group 2 : గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం!
X

డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ రెండు పరీక్షల మధ్య చదువుకునే వ్యవధి ఉండేందుకు గానూ గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం బేగంపేటలోని హరిత పర్యాటక హోటల్లో టీజీ పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు, నిరుద్యోగులతో ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అభ్యర్థులు వెలువరించిన అభిప్రాయాలను, డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ఎంపీ చామల కిరణ్ చెప్పారు. పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఉండాలనే ప్రభుత్వం అనుకుంటోందని, అందుకు వీలుగా గ్రూప్ -2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రినిర్ణయం తీసుకుంటారనీ. డీఎస్సీ పరీక్షను చక్కగా రాయాలని సూచించారు.

నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా వున్నారని, ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పారు ఎంపీ కిరణ్. త్వరలో జాబ్ కేలండర్ విడుదల జరుగుతుందని భరోసా ఇచ్చారు.

Tags

Next Story