Mulugu Encounter : ములుగు ఎన్ కౌంటర్ మృతులకు ముగిసిన పోస్టుమార్టమ్

Mulugu Encounter  : ములుగు ఎన్ కౌంటర్ మృతులకు ముగిసిన పోస్టుమార్టమ్
X

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశముంది. మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు రాగానే మృతదేహాల అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏడు మృతదేహాలను ఫ్రీజర్‌లో భద్రపరిచిన అధికారులు భారీ భద్రతను కొనసాగిస్తున్నారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story