Kamareddy : కామారెడ్డి ట్రిపుల్ డెత్ కేసులో పోస్టుమార్టమ్ రిపోర్ట్ విడుదల

కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట యువకుడు నిఖిల్ ఆత్మహత్యలో మిస్టరీ ఇంకా వీడలేదు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో మునగడంతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది.. నీటలో ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే ముగ్గురి బాడీలపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు తేల్చారు. ముగ్గురూ కలిసే చనిపోయారా? లేదంటే ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు యత్నించి మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా... అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో టెక్నాలజీ సాయంతో విచారణ సాగిస్తున్నారు పోలీసులు. భిక్కనూరు ఠాణా నుంచి అడ్లూర్‌ఎల్లారెడ్డి చెరువు వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. ముగ్గురి సెల్‌ఫోన్ల డేటాను తీసుకుంటున్నారు. ముగ్గురూ ఒకే టైంలో నీటిలో దూకి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com