BRS : సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు.. ముగ్గురు బీఆర్ఎస్ సపోర్టర్స్ అరెస్ట్

ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రిగా (Telangana CM) బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి (Revanth Reddy), మాజీ ప్రభుత్వం ఏదో ఒక విధంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉంది. 6గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారుపై అభ్యంతరక పోస్టింగ్ లు పెడుతున్న ముగ్గురు బీఆర్ఎస్ (BRS) తరపున పని చేస్తోన్న సోషల్ మీడియా వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసిన ఫొటోను పోస్ట్ చేశారు. దాంటు పలు సోషల్ మీడియా గ్రూప్స్ ల్లోనూ షేర్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన ముగ్గురు బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు. అయితే సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ ఛైర్మన్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com