సెప్టెంబర్ 17.. ప్రజాపాలన దినోత్సవం... జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

సెప్టెంబర్ 17.. ప్రజాపాలన దినోత్సవం... జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ
X

ఈ నెల 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని33 జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.

Tags

Next Story